mt_logo

పోలవరం విషయంలో సుప్రీంకోర్టుకెళ్తాం – కేసీఆర్

భద్రాచలం డివిజన్ లోని పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలుపుతూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ముంపు గ్రామాలను కలపడమే అన్యాయమైతే ఇప్పుడు 7 మండలాలను కూడా ఆంధ్రలో కలుపుతామనడం అన్యాయం, అప్రజాస్వామికం అని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలో వ్యక్తిగతంగా కలిసి ఈ విషయంలో కేంద్రం ప్రమాదకర నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్తామని, న్యాయం జరిగేవరకు టీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *