ఆంక్షలు లేని తెలంగాణ కావాలని, షరతులతో కూడిన తెలంగాణ ఇచ్చినా ప్రయోజనం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేసారు. తెలంగాణ బిల్లులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని సవరిస్తూ ఆంక్షలు లేని తెలంగాణ మాత్రమే ఇవ్వాలని ప్రధానమంత్రికి ఒక లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన కేకే, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు జగదీష్ రెడ్డితో కలిసి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి తెలంగాణ బిల్లుపై చర్చించారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళు, నిధులు, నియామకాల కేటాయింపులో జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికని, ఆంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు కట్టారు కానీ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టాలంటే మాత్రం జలబోర్డుల చుట్టూ తిరగడం కానిపని అని, బిల్లులో గోదావరి, కృష్ణా నదులపై బోర్డులు ఏర్పాటు చేస్తామని ఉందని, ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేదిలేదని కేసీఆర్ భావించినట్లు సమాచారం. ఇన్నేళ్ళబట్టి ఉద్యోగాల విషయంలో అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాకకూడా అక్రమంగా ఉద్యోగం పొందిన సీమాంధ్రులకు పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ విషయం సీమాంధ్ర ప్రాంతమే చూసుకోవాలని కేసీఆర్ ప్రధానికి రాసే లేఖలో వివరించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేసీఆర్ డిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని, 5నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రం వచ్చేసినట్లేనని, అందులో ఏమాత్రం సందేహం లేదని కేంద్రమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన టీ ఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు బలవంతపు పెళ్లి అని, ఆ పెళ్లి పెద్దలు కుదిర్చినది కాదని, ప్రేమ వివాహమూ కాదని, ఎప్పుడైనా విడిపోవచ్చని నెహ్రూనే స్వయంగా చెప్పారని జైపాల్ రెడ్డి చెప్పారు. షరతులతో కూడిన…
గత మూడు రోజులుగా టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖరరావు ఢిల్లీలో ప్రధాని, అన్ని పార్టీల జాతీయ నాయకులను కలుస్తూ తెలంగాణకు మద్దతు కూడగడుతున్నారు. మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసిన కేసీఆర్ తెలంగాణ బిల్లులో కొన్ని అంశాలు తెలంగాణకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, వాటిని సవరించి సంపూర్ణ తెలంగాణను ఇవ్వాలని ఒక విజ్ఞాపన లేఖను ప్రధానికి ఇచ్చారు. అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించి బిల్లు ఆమోదానికి కేంద్రం సిద్ధంగా ఉందని,…
60 దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలు కోరుకునేది సంపూర్ణ తెలంగాణ అని, ఆంక్షల తెలంగాణ కాదని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో సంపూర్ణ తెలంగాణ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. 28 రాష్ట్రాలకు ఉన్న నిబంధనలు, అధికారాలే 29 వ రాష్ట్రంగా ఏర్పడనున్న తెలంగాణకు కూడా వర్తించాలని కోదండరాం డిమాండ్ చేశారు. బిల్లులో తెలంగాణపై 13…