mt_logo

తెలంగాణ గడ్డపై పరాయి ఆధిపత్యం సహించం- దేవీప్రసాద్

శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ విజయోత్సవసభకు తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ఉద్యోగులు అవసరం లేదని అన్నారు. అన్ని శాఖల్లో తెలంగాణ ఉద్యోగులే ఉన్నతాధికారులుగా పనిచేయాలని, తెలంగాణ గడ్డపై పరాయి ఆధిపత్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఇలాగే జరిగితే భవిష్యత్ లో మరో తిరుగుబాటు ఉద్యమం చేయడానికి వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 25 వేలమంది సీమాంధ్ర ఉద్యోగులు హెచ్‌వోడీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తే ఊరుకునేదిలేదని, తీవ్రంగా ప్రతిఘటిస్తామని అన్నారు. పోలవరం ముంపుగ్రామాలను సీమాంధ్రలో కలపడం తెలంగాణపై కుట్రగా భావించాల్సిఉంటుందని, ఇన్ని పోరాటాలు చేసినా ఆంక్షల్లేని తెలంగాణ సాధించుకోలేక పోయామని, తేడా వస్తే మళ్ళీ ప్రత్యక్ష యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ జేఏసీ రాష్ట్ర నాయకుడు వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *