దేశచరిత్రలో మహత్తర ఉద్యమరూపాల్లో 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం తర్వాత.. తెలంగాణ కోసం ఓరుగల్లులో 2010 డిసెంబర్ 16న జరిపిన ఓరుగల్లు మహాగర్జన సభలో అత్యధికమంది ప్రజలు పాల్గొన్నట్టు .. ది ఎకనమిక్ టైమ్స్ ఇవ్వాళ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
వరంగల్ మహాగర్జనను .. 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం.. 1963 లో అమెరికా చరిత్రను మలుపుతిప్పిన మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో జరిగిన పౌరహక్కుల సాధన సభ .. 1986లో బేనజీర్‌బుట్టో తిరిగి పాకిస్థాన్‌కు వచ్చినప్పుడు దేశప్రజలు స్వాగతం పలికిన మహత్తర ఘట్టం..
1989లో చైనాలోని తియాన్మెన్ స్క్వేర్ ముట్టడి.. 2003 ఫిబ్రవరి 15.. ఇరాక్‌పై యుద్ధాన్ని నిరసిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా 600 పట్టణాల్లో జరిగిన యాంటీ వార్ ర్యాలీలు.. 2004లో ఆరెంజ్ రివల్యూషన్.. 2011లో లిబియా, టునీషియాలో జరిగిన ప్రజావిప్లవాలతో పోల్చింది.
ఈ సభ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డల ఆకాంక్షను చాటి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంలో కీలక మలుపుగా మారిందని కీర్తించింది. ఈ సభకు పోలీసుల అవాంతరాలను.. నిర్బంధాలను చేధించుకొని.. 15 లక్షల మంది వరకు హాజరైనట్టు అధికారిక సమాచారం ఉందని పేర్కొంది. నిజానికి ఈ సంఖ్య 30 లక్షలు దాకా ఉంటుంది.