తెలంగాణ ఉద్యమంపై విషం కక్కుతూ పరకాల ప్రభాకర్ బ్యాచి రాసిన పచ్చి అబద్ధాల పుస్తకానికి అసలు నిజాల జవాబులతో కూడిన “విశాంధ మహారభస” పుస్తకావిష్కరణ అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో జులై 14నాడు జరిగింది.
న్యూ జెర్సీ నగరంలో తెలంగాణ డెవెలప్మెంట్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్ లో భాగంగా జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రమా మేల్కొటే, అందెశ్రీ, శ్రీధర్ రెడ్డి (MLC), మురళి చింతలపాణి, జమున పూస్కూరు, వెదిరె శ్రీరాం, విశు కాల్వల, జంగారెడ్డి (BJP), విజయ్ కృష్ణ చాట్ల, జగదీష్ బొందుగుల, తదితరులు పాల్గొన్నారు.
పుస్తకం ప్రచురించిన తెలంగాణ ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ బాల్ రెడ్డి పుస్తకాన్ని పరిచయం చేశారు.