చేనేతకు మద్దతిచ్చిన యూకే NRI మహిళలు లండన్ లో చేనేత వస్త్ర నిలయం ఏర్పాటుకు ప్రయత్నాలు.
చేనేత పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు కృషి చేద్దాం, బాధ్యత వహిద్దాం అనే నినాదంతో తెలంగాణ NRI ఫోరం మహిళలు ముందుకొచ్చారు.
సిరిసిల్ల నుండి ప్రత్యేకంగా తెప్పించిన వస్త్రాలను ధరించి లండన్ బ్రిడ్జి వద్ద ప్రదర్శించి “We Support Telangana Weavers” అనే నినాదంతో మద్దతు తెలిపారు.
తెలంగాణ NRI శాఖా మంత్రివర్యులు KT. Rama Rao వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలు దరిస్తా అన్న స్ఫూర్తితో మేము సైతం అంటున్నారు లండన్ మహిళలు.
త్వరలో సిరిసిల్ల హ్యాండ్లూమ్, ప్రభుత్వ సహకారంతో వచ్చే నెలలో చేనేత చీరలు మరియు షర్ట్స్, గృహావసరాల నిమిత్త బట్టలు మొదలైనవి తెలంగాణ నుండి తెప్పించి లండన్ లో ఒక వస్త్రనిలయం ఏర్పాటు చేసి మార్కెటింగ్ కి కృషి చేస్తామని ప్రతినిధులు కాసర్ల జ్యోతి రెడ్డి, శ్రీ లక్ష్మీ, అంతటి మీనాక్షి తెలిపారు.
యూరోప్ లో కాటన్ వస్త్రాల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కొంత సమయం తీసుకొని మొదట ఇక్కడి ప్రవాస భారతీయులకు పరిచయం చేస్తామని మార్కెటింగ్ సన్నాహాలు చేస్తామని గోలి కవిత తెలిపారు.
ఇతర తెలంగాణ/తెలుగు సంఘాల మహిళల సహాయం తీసుకొని రాబోయే బోనాలు, బతుకమ్మ సంబరాల్లో చేనేత కు పూర్తిస్థాయి గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తామని సిక్కా ప్రీతీ తెలిపారు. సిరిసిల్ల నుండి ప్రత్యేకంగా తెప్పించిన చేనేత వస్త్రాలను లండన్ చారిత్రిక ప్రదేశాల్లో ధరించి ఫోటో, వీడియో షూట్ నిర్వహించి సోషల్ మీడియా ద్వారా ప్రవాస భారతీయులను కదిలించే దిశగా మా ప్రయత్నం మొదలు పెట్టామని అనసూరి వాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగుల శౌరి, గంప జయశ్రీ, హేమలత గంగసాని, పాల్గొన్నారు.
ప్రవాస తెలంగాణ మహిళలు చేనేతకు మద్దతు ఇవ్వడం పై చేనేత బంధు, పద్మ శ్రీ, శ్రీ చింతకింది మల్లేశం గారు ప్రశంసించారు. వీడియో ద్వారా తన సందేశాన్ని అందజేస్తూ తమ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.