నీళ్ళు, నిధులు, ఉద్యోగాలకోసమే తెలంగాణ సాధించుకున్నాం..టీఎస్ పీఎస్సీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు భర్తీ చేద్దామంటే కేంద్రం ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేయడం లేదని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో బడ్జెట్ సమావేశాలపై జరుగుతున్న చర్చ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి పైవిధంగా స్పందించారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుచేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని లక్ష్మణ్ కోరారు.
ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఉద్యోగుల భర్తీ చేయాల్సిన అవసరం ఉందని, కానీ మీ కేంద్ర ప్రభుత్వ వైఖరివల్లే ఆలస్యం అవుతుందని, 40 నిమిషాల పనికి నాలుగునెలలుగా సాగదీస్తున్నారని, 40 మందితో ప్రభుత్వం నడుస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారని, రాష్ట్రం ఏర్పడి ఐదునెలలు కావస్తున్నా కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.