mt_logo

ముగిసిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం

తెలంగాణ భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ పేరును ఆ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య ప్రతిపాదించగా పార్టీ ఎమ్మెల్యేలందరూ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు సమావేశం ప్రారంభం కాగానే 14 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమాన్ని ఒంటిచేతితో నడిపించి పార్టీని గెలిపించిన కేసీఆర్ ను అభినందిస్తూ తీర్మానం చేశారు. మరికొన్ని తీర్మానాలను కూడా ఈ సమావేశంలో ప్రతిపాదించారు. అందులో విద్యార్థులపై పెట్టిన కేసులను తొలి కాబినెట్ లోనే ఎత్తివేయాలని తీర్మానించారు.

అనంతరం హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, నీళ్ళు, నిధులు, నియామకాలే తమ ట్యాగ్ లైన్లని, ఆకలికేకలు, ఆత్మహత్యలు లేని సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సాధించడంలో చూపిన స్ఫూర్తిని అభివృద్ధిలోనూ చూపుతామని, రాజకీయ అవినీతిని రూపుమాపి తెలంగాణ పునర్నిర్మాణానికి కృషి చేస్తామని, దేశంలోనే హైదరాబాద్ ను గొప్పనగరంగా తీర్చిదిద్దుతామని ఈటెల పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *