mt_logo

టీఆర్ఎస్ ప్రజలకోసమే ఉద్యమిస్తుంది: పోచారం శ్రీనివాస్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉద్యమిస్తుంది తప్పితే అధికారం కోసం పాకులాడట్లేదని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కు అధికార దాహం లేదని, కాంగ్రెస్ పార్టీనే రాజకీయ లాభం కోసం తహతహలాడుతుందని విమర్శించారు. శుక్రవారం సచివాలయంలో మీడియాపాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను ఎప్పుడు విలీనం చేస్తారా? అని కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన మాట నిజమే కానీ, 2004 లోనో, 2009 లోనో  ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ ప్రజలపై ఉన్న ప్రేమతోకాదని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఉద్యోగులు స్థానికత ఆధారంగా వెళ్లిపోవాల్సిందేనని కేసీఆర్ అనడం నిజమేనని పేర్కొన్నారు. నిజామాబాద్ రైతులు నీళ్ళు లేక విలవిల్లాడిపోతున్నారని, నిజాంసాగర్ కు సింగూర్ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వదలాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *