రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించి రాజకీయ పార్టీగా పేరొందాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమావేశమై మున్సిపల్ ఎన్నికల విషయమై చర్చించారు. ఈ ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి విజయం సాధించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని, అందులో కూడా ఘన విజయం సాధించి రాజకీయ పార్టీగా వెలుగొందాలని సమావేశంలో చర్చించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో, ప్రచార బాధ్యతలను అప్పగించే విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రచార బాధ్యతలను పార్టీ నేతలు కేకే, ఈటెల, హరీష్ రావు, ఎంపీలు మందా జగన్నాథం, వివేక్ లకు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలకు అప్పగించారు.
- CAG data exposes false claims of Congress on interest payments
- Thanks to KCR, Telangana emerges as best inland fish state
- NHRC takes cognizance of Lagacharla issue; seeks report from CS, DGP
- Pharma companies taking over fertile lands of tribals in Kodangal
- Congress govt. stops providing snacks to 10th students in special classes
- పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పొతుంది.. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదు: కవిత
- మహారాష్ట్రలో 5 గ్యారంటీల కాంగ్రెస్ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్ రావు
- దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని తేలిపోయింది: కేటీఆర్
- తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారు.. అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కారు: కేటీఆర్
- త్వరలో కుల గణన డెడికేటెడ్ కమీషన్‌కు తెలంగాణ జాగృతి నివేదిక
- అదానీ వ్యాపార విస్తరణ తెలంగాణలో జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియదా?: కేటీఆర్
- నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం రేవంత్‌కి అలవాటు: హరీష్ రావు
- మహాధర్నాకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్‌కి చెంపపెట్టు: సత్యవతి రాథోడ్
- రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు: హరీష్ రావు
- అదానీ అంశంలో చేతులెత్తేసిన రాహుల్.. రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?