కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని టీఆర్ఎస్ సర్కారుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరకముందే ప్రతికూల అంశాలు చేరుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలే తమ ప్రచార సాధనాలని, సమాచార వ్యవస్థను గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయికి విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇదిలాఉండగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా అర్హులైన 29 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పెన్షన్ల కోసం సుమారు 4 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయడం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని ఈటెల పేర్కొన్నారు.