mt_logo

టీఆర్ఎస్ ప్లీనరీ ఈనెల 18 కి వాయిదా

ఈనెల 11, 12 తేదీల్లో జరగాల్సిన టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగ సభలను హుదూద్ తుఫాను కారణంగా వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, 18 న ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ, 19 న పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *