మెదక్ పార్లమెంటు స్థానానికి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని, కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కీలకం కాబోతున్నదని స్పష్టం చేశారు. గజ్వేల్ కు త్వరలో రైలు రాబోతున్నది. మెదక్ పార్లమెంట్ నుండి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. మెదక్ ఎంపీ గా కొత్త ప్రభాకర్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఆనవాయితీ ప్రకారం కోనాయిపల్లి వెంకటేశ్వరుడి గుడిలో కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ కోనాయిపల్లి వేంకటేశ్వరుని ఆశీస్సులతో అన్ని పనుల్లో విజయం సాధించారని, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారని హరీష్ రావు పేర్కొన్నారు.