mt_logo

టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నేడే

తెలంగాణలో ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. కేసీఆరే ముఖ్యమంత్రి కావాలంటూ యావత్ తెలంగాణ ప్రజలు, పార్టీ నేతలు భావిస్తున్న తరుణంలో, తెలంగాణ భవన్‌లో సమావేశమై తమ అధినేతను ఎన్నుకోనున్నారు.
జూన్ 2న అపాయింటెడ్ డే అయినందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు కాబట్టి అప్పటివరకూ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అపాయింటెడ్ డే ముందుకు జరపాలని గతంలో టీఆర్ఎస్ పార్టీ కేంద్ర హోం శాఖ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ విషయం న్యాయశాఖ పరిధిలో ఉన్నందున అపాయింటెడ్ డే ఎప్పుడనే విషయంలో క్లారిటీ వచ్చాకే కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *