mt_logo

ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా టీఆర్ఎస్ మేనిఫెస్టో

ప్రజల సలహాలు, సూచనలకు అనుగుణంగానే టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో ఈనెల 17 న ప్రకటిస్తామని, సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో   ఇంకా సిద్ధం కాలేదని, శనివారం కమిటీ మరోసారి భేటీ అయ్యి మేనిఫెస్టోలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తామని శ్రీహరి పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న భౌగోళిక తెలంగాణ వచ్చిందని, ఇక కలలు గంటున్న తెలంగాణ ఎలా ఉండాలో  మేనిఫెస్టోలో చూస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజానీకం నుండి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరించడానికి ప్రత్యేకంగా   ఈ-మెయిల్ ఐడీ trsmanifesto@gmail.com ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సూచనలు స్వీకరించేందుకు టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం నుండి ఒక సూచనల బాక్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఎవరైనా రాతపూర్వక సూచనలు ఇవ్వదల్చుకుంటే లిఖితపూర్వకంగా ఇవ్వవచ్చని చెప్పారు. పధ్నాలుగేళ్ళుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ తెలంగాణ అభివృద్ధిపై చాలా ఆలోచనలు ప్రజల ముందు ఉంచారని, వాటికనుగుణంగానే ప్రణాళికలు తయారు చేశామని  స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు వినోద్, రమణాచారి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *