ఇంటింటికీ టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రచారం..

  • April 9, 2019 8:46 pm

లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపుకోసం టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ఇంటింటి ప్రచారం నిర్వహించింది. నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉప్పు సాయిరాం ఆధ్వర్యములో, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ సత్యంరావు ఆధ్వర్యంలో వరంగల్, మహబూబ్ నగర్, జనరల్ సెక్రటరీ అభినయ్ ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో మొత్తం గ్రామాల్లో టీఆర్ఎస్ పథకాలు, ఎందుకు టీఆర్ఎస్ ను గెలిపించాలి? టీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.


Connect with us

Videos

MORE