mt_logo

ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశాం: హరీష్ రావు


బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశాం. బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదంటూ.. ఏమీ తేల్చకపోవడంతో బయటకు వచ్చినం అని తెలిపారు.

ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేసినం. ఒక రోజు ప్రభుత్వానికి, మరోక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం..లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం.. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాల కీలకం. ఖచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు.

కానీ బీఏసికి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరం తెలియచేస్తున్నం. బీఏసి చెప్పినట్టే సభ నడుస్తుంది. హౌస్ కమీటీల ఏర్పాటు చేయాలి. పీఏసీ కమీటీ పైన మా పార్టీ అభిప్రాయం కాకుండా ఏట్లా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్‌ను అడిగినం. ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ ఉల్లంఘనలపైన స్పీకర్ హమీ ఇచ్చారు, ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని అన్నారు అని తెలిపారు.

బీఏసీ లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపై, పుట్టినరోజులు, పెళ్లిలు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపైన, కౌలు రైతులకు రూ. 12 వేలంటూ భట్టి విక్రమార్క బయట ప్రకటన చేయడంపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం అని హరీష్ రావు అన్నారు. ప్రతిరోజు జీరో ఉండాలని డిమాండ్ చేశారు.

మా పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య మేరకు మాట్లాడే సమయం ఇవ్వాలని కోరినం. మేం టీషర్టులతో వస్తే అడ్డుకున్న తీరుపైన తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాం.  టీ షర్ట్ వేసుకుని రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు పోయినప్పుడు మమ్మల్ని ఎట్లా అపుతారు అని అడిగారు.