హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తునాడంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో 1.61 లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసింది. కానీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు డబ్బా కొట్టుకొడుతున్నారు. మీరు చెప్పే 50 వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలోనే నోటిఫై చేసి, పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినవే కాదా? ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలు ఇచ్చి, అవన్నీ తామే చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది, కానీ ఈరోజుకి 10% కూడా పూర్తి చేయలేదు. 2023 డిసెంబరు 9వ తేదీకి రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా, అర్హులైన రైతుల్లో సగానికి పైగా ఇంకా వేచి చూడాల్సిన దుస్థితి. ప్రతి నెలా రూ. 4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా, 11 నెలల తర్వాత కూడా అమలు చేయలేదు అని విమర్శించారు.
18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. ప్రతి విద్యార్థికి రూ. 5 లక్షలతో విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రతి పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, సన్న రకాలకు మాత్రమే పరిమితం చేశారు అని అన్నారు.
కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ ఉసేలేదు. మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాల హామీ గుర్తు కూడా లేదు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు నెరవేరతాయని చెప్పారు. కానీ, ప్రభుత్వం వచ్చి 300 రోజులు గడిచినా హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు అని హరీష్ రావు మండిపడ్డారు.
కొత్త హామీల సంగతి దేవుడెరుగు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను అటకెక్కించింది. రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, పోషక కిట్, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్, బతుకమ్మ చీరలు ఇంకా ఎన్నో పథకాలు నిలిచిపోయాయి అని ఆక్షేపించారు.
వాస్తవాలు ఇలా ఉంటే.. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం తమ వైఫల్యాలను విజయాలుగా చూపించేందుకు విఫల యత్నాలు చేస్తూ దేశ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.
- Fact Check: Did the BRS govt. misappropriate Rs. 55 cr for Formula-E race?
- Impending liquor price hike to generate Rs. 7,000 cr revenue
- Telangana farmers in distress due to yield decline and lack of govt. support
- Congress govt’s apathy forces farmers to sell paddy to private millers
- Real estate slowdown: October registration revenue falls by Rs. 424 Cr compared to 2023
- కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?: కేటీఆర్ ధ్వజం
- రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- కేబినెట్ మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీకి ప్రాజెక్టులా?: కేటీఆర్ ధ్వజం
- గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
- కేవలం బ్లాక్మెయిల్ దందా కోసం హైడ్రాని పెట్టారు: రియల్టర్స్ ఫోరం సమావేశంలో కేటీఆర్
- కుటుంబ సర్వే నుండి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలి: రేవంత్‌కు హరీష్ రావు లేఖ
- ఆటోడ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉంది.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: కేటీఆర్
- ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను మూసివేసే కుట్ర జరుగుతోంది: హరీష్ రావు
- రాహుల్ గాంధీ గారు అ’శోక నగరాన్ని సందర్శించండి: హరీష్ రావు
- తెలంగాణలో జరగుతున్న అరాచక పాలనపై రాహుల్ గాంధీ సమీక్ష చేయాలి: హరీష్ రావు