ఈ రోజు తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యంలో “రాయల తెలంగాణ” ప్రతిపాదనను నిరసిస్తూ చేపట్టిన “తెలంగాణ ఎన్నారై ల – నిరసన ధర్నా” విజయవంతం అయ్యింది.
అందుబాటులో ఉన్న TeNF సబ్యుల తో పాటు వివిధ దేశాల ఎన్నారైలు మరియు TAF , OU JAC , JNTU JAC , TGVP , Telangana IT JAC ప్రతినిథులు హాజరై మద్ధతు తెలిపారు.
అలాగే GHMC – TJAC చైర్మన్ అయాచితం శ్రీధర్ గారు హాజరై JAC తరపున మద్దతు తెలిపారు.
TeNF ఫౌండర్ మెంబెర్ గంప వేణుగోపాల్ తో పాటు ముఖ్య నాయకులు సిక్క చందు గౌడ్, ఉదయ నాగరాజు, రాజ్ కుమార్ శనబోయన, రంగుల సుధాకర్, సబ్యులు చల్ల ప్రశాంత్ రెడ్డి, శశిధర్, వినయ్, కృష్ణ బాబు, ప్రవీణ్, సుబాష్ తదితరు పాల్గొన్న వారిలో ఉన్నారు.