mt_logo

తిరుగుముఖం పట్టిన తెలుగుతేజం

తెలంగాణ ఏర్పాటు పట్ల ఒక స్పష్టత లేక, సీమాంధ్రలో ఏదో పొడిచేద్దామని బయలుదేరిన నాగభైరవుడికి భంగపాటు తప్పలేదు.

లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు నాగభైరవ జయప్రకాష్ నారాయణ కర్నూల్ లో మొదలుపెట్టిన తెలుగు తేజం యాత్ర అనంతపూర్ లో అర్ధాంతరంగా ముగిసింది.

అనంతపురంలో లోక్ సత్తా ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన నాగభైరవుడిని సమైక్యవాదులు అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు.

తెలుగు తేజం యాత్రను “తెలుగు తల్లి” విగ్రహం నుంచే ప్రారంభించి విగ్రహానికి పూలమాల వెయ్యకపోవడాన్ని తప్పుపట్టారు. బంద్ లు తప్పని చెప్పడంపై మండిపడ్డారు. సమైక్యవాదులతో నాగభైరవ మాట్లాడే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు సరికదా మైక్ కట్ చేసి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. నాగభైరవ వాహనం టైర్లలో గాలి కూడా తీసేశారు.

చివరకు పోలీసుల భద్రత మధ్య ఆయన సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. సమావేశం జరుగుతున్నంతసేపు సమైక్యవాదులు “సమైక్యాంధ్ర” అంటేనే సభలు నిర్వహించాలంటూ హెచ్చరించడం, పోలీసులు కూడా భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేయడంతో తెలుగుతేజం యాత్రను వాయిదా వెయ్యక తప్పలేదు.

హైదరాబాద్ వచ్చినాక యాత్ర తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందో నిర్ణయం తీసుకుంటామని లోక్ సత్తా నాయకులు చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో చిన్న సంఘటన జరిగినా మిన్నువిరిగి మీదపడ్డట్టు మాట్లాడే నాగభైరవ బృందం, సీమాంధ్ర ఆందోళనల్లో జరుగుతున్న అనేక అరాచకాలపై పెద్దగా స్పందించకపోవడం వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.

Related:

రెంటికీ చెడుతున్న మరో ఊసరవెల్లి నాగభైరవ జయప్రకాశ్ నారాయణ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *