తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా (TAM) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు మరిడేక స్క్వేర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మలేషియా ప్రైమ్ మినిస్టర్ నజీబ్ రజాక్ మరియు ఫెడరల్ టెరిటోరీస్ మినిస్టర్ తుంకూ అద్నాన్ మన్సూర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చిన్నారుల అట పాటలు ప్రేక్షకులను అలరించాయి. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాపర్ ప్రణవ్ చాగంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యాక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ TAM ప్రెసిడెంట్ డా. అచ్చయ్య కుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేసారు.