కాంగ్రెస్ వార్ రూంలో జరిగిన ఆంటోనీ కమిటీ భేటీ తరువాత విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగేది కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు.
తెలంగాణ నిర్ణయం రాష్ట్రంలోని పార్టీలతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాతే తీసుకున్నామని, తీరా నిర్ణయం తీసుకున్నాక తెదేపా మాటమార్చడం దురదృష్టకరం’ అన్నారు.
ప్రస్తుతం పార్లమెంటు నడుస్తున్నందున ఆంటోనీ కమిటీ హైదరాబాద్‌కు వెళ్లదని, కలవాలనుకున్నవారు డిల్లీకివచ్చి కమిటీని కలవాలని సూచించారు. రు. కమిటీ నివేదిక త్వరలోనే ఇస్తుందని ఆయన చెప్పారు.
విధి విధానాల విషయంలో అభ్యంతరాలున్నాయని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తపరిచిన విషయం పేర్కొనగా.. ‘విధివిధానాలను చర్చించడానికి అసెంబ్లీకి తీర్మానం వస్తుంది. అప్పుడు ఆయా పార్టీలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. తిరిగి ముసాయిదా బిల్లు రూపంలో రెండోసారి అసెంబ్లీకి వస్తుంది. అప్పుడు కూడా చర్చించేందుకు ప్రతిపక్షాలకు అవకాశముంది. దానితో పాటుపార్లమెంటు ఉభయసభల్లో కూడా చర్చకు వస్తుంది. అక్కడా చర్చించవచ్చు’ అని దిగ్విజయ్ స్పష్టం చేశారు.