mt_logo

మూజువాణి ఓటుతో తెలంగాణ-హరీష్ రావు

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే తెలంగాణ ఆగదని, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో టీఆర్ఎస్ నేత లక్ష్మారెడ్డి ఇంటివద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీఎం కిరణ్ పై మండిపడ్డారు. సీఎం కిరణ్ ఎంత అరిచి గీ పెట్టినా తెలంగాణ వచ్చితీరుతుందని, మూజువాణి ఓటు విధానం ద్వారా రాజ్యాంగబద్ధంగా బిల్లు ఆమోదం పొంది తీరుతుందని చెప్పారు. అసెంబ్లీలో కుట్రలు చేసి బిల్లుపై వ్యతిరేక తీర్మానం చేసి కేంద్రానికి పంపినా లాభం లేదని, మంత్రులు కూడా ఆయనకు ఎదురుతిరిగినప్పుడే ఆయన సభానాయకుడిగా అర్హత కోల్పోయారని, టెక్నికల్ గా మాత్రమే సీఎం గా ఉన్నారని విమర్శించారు. మహిళా మంత్రులపై దౌర్జన్యం చేయడం అతడి నిరంకుశ ధోరణికి నిదర్శనమని, తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలపాలని కోరారు. పార్లమెంటులో 542 మంది ఎంపీలు ఉంటే అందులో 25 మంది సీమాంధ్ర ఎంపీలు ఉన్నారని, ఏమి చేసినా తెలంగాణ బిల్లును అడ్డుకోలేరని అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని, బీజేపీకి రాష్ట్రంలో అధికారం కోసం బ్లాంక్ ఆఫర్ ఇస్తున్నాడని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *