తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1988 చట్టాన్ని తెలంగాణకు అన్వయిస్తూ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ – 101 ప్రకారం తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, జేఎన్టీయూ యూనివర్సిటీల వీసీలను నియమించింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ విచ్చేశారు. నల్సార్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.