mt_logo

తెలంగాణ ఏర్పాటు పూర్తయినట్లే-హరీష్ రావు

ఆదివారం లక్డీకపూల్ వాసవీభవన్ లో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2014 డైరీని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు, ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణను రాకుండా ఆపలేరని, ఫిబ్రవరిలో కొత్త రాష్ట్రం ఏర్పడటం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని తెలిసినా కిరణ్ కుమార్ రెడ్డి, జగన్, చంద్రబాబులు డ్రామాలాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, పైకి సమైక్యవాదం వినిపిస్తున్నా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మనసులో మాత్రం విభజన జరగాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించగానే ఉద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొని ముందుకు నడిపించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినతర్వాత కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ వైద్య భాస్కర్ రచించిన తెలంగాణ తల్లికి గేయ నీరాజనం సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు జి. రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *