కరెంట్ ఛార్జీలు తగ్గించమంటే తెలంగాణ రైతులను కాల్చి చంపించిన చంద్రబాబు గతాన్ని ప్రజలు మర్చిపోలేదని, తన బానిసలతో యాత్రలు చేయిస్తూ కుక్కల్లా మొరిగిస్తే అబద్ధాలు నిజాలు కావని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో బొగ్గు, నీళ్ళు ఉన్నా విద్యుత్ ప్లాంట్లు పెట్టని బాబు తెలంగాణలో ఆంధ్రా ఆధిపత్యం కొనసాగించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ లోకి వలసలు ఆపేందుకే బాబు యాత్రలు చేయిస్తున్నారని, తెలంగాణ టీడీపీ నేతలు బస్సు యాత్రలు చేయడం ఆపి బాబు ఇంటి ముందు దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణపట్నం నుండి తెలంగాణకు రావాల్సిన కరెంట్ ను బాబు ఆపింది వాస్తవం కాదా? అని, లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రాకు పోవడానికి బాబు కారణం కాదా? అని ప్రశ్నించారు.