ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన ఏపీ సీఎం చంద్రబాబు రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన ఇంటివద్ద ఉన్న తెలంగాణ పోలీసులను తొలగించి ఆంధ్రా పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకోవడంపై తెలంగాణ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఏపీ పోలీసులు మోహరించడం విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం విరుద్ధమని, ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని, తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని పేర్కొన్నారు.
ఆంధ్రా పోలీసులకు, అధికారులకు తెలంగాణపై ఎలాంటి అధికారాలు ఉండబోవని సెక్షన్-8 చెప్తుందని, ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రం పోలీసుల జోక్యం చెల్లదని న్యాయనిపుణులు తెలిపారు. ఏపీ సీఎం, డీజీపీపై చర్యలు తీసుకుంటామని, తమిళనాడు, మహారాష్ట్రకు వెళ్లి మన పోలీసులను మోహరిస్తే వాళ్ళు ఊరుకుంటారా? అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏపీ పోలీసుల పెత్తనం ఏమిటని? తెలంగాణలో పూర్తి శాంతిభద్రతల అధికారం తమదేనని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులు అంటున్నారు.