లండన్: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2017 – 18 పై ఎన్నారై తెరాస యుకె శాఖ లండన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం గారు, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి గారు మరియు కార్యదర్శి & అధికార ప్రతినిధి చాడ సృజన్ రెడ్డి గారు పాల్గొని వివిధ అంశాలను ప్రజలకు వివరించారు.
ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వివరాలని గణాంకాలతో సహా తెలుపుతూ, ప్రతి శాఖకు కేటాయించిన బడ్జెట్ ని క్లుప్తంగా వివరించారు. బడ్జెట్ బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేవిధంగా ఉందని కొనియాడుతూ కులవృత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే గ్రామాలకు పునర్జీవం పోసినట్టే అని అన్నారు. ఇది బడుగు బలహీన వర్గాల బడ్జెట్ అని, సబ్భండ వర్గాల బడ్జెట్ అని తెలిపారు. కెసిఆర్ గారికి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారికి అభినందనలు తెలిపారు.
అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎన్నో బడ్జెట్లు చూసిన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి సబ్బండ వర్ణాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ ని చూడలేదని, బడుగు బలహీన వర్గాల – ప్రజల పక్షపాతి అయినటువంటి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం వల్లే ఇది సాధ్యమయ్యిందని, బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారిని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని అభినందించి కృతఙ్ఞతలు తెలిపారు. వివిధ శాఖలకు కేటాయించిన బడ్జెట్ వివరాల్లోకి వెళ్లి విశ్లేషిస్తూ, నేటి వరకు బీసీ ల పేరుతో ఓట్ల రాజకీయం మాత్రమే చేసారని, కానీ మొట్టమొదటి సారి కెసిఆర్ గారి నాయకత్వం లోని ప్రభుత్వం, ప్రతి బీసీ సామాజికవర్గ అభ్యున్నతి కోసం, ప్రత్యేకంగా అందులో మరింత వెనకబడ్డ ఎంబీసీ ల కు ప్రత్యేకించి వెయ్యి కోట్లు కేటాయించడం ప్రజల పట్ల ప్రభుత్వానికి కెసిఆర్ గారికి ఉన్న లోతైన అవగాహనకు నిదర్శనమని ప్రసంశించారు.
ఈ బడ్జెట్ ఉపాధి కోల్పోయిన ఎందరో పేద వారికి వరంగా ఉందని, ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వాలు కుల వృత్తులకు ప్రాధాన్యం ఇవ్వలేదని, కానీ తెరాస ప్రభుత్వం మాత్రం కుల వృత్తులను ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కేవలం క్షేత్రస్థాయిలోని ప్రజలే కాకుండా యావత్ ఎన్నారై తెలంగాణ సమాజం హర్షిస్తుందని, ఇది కేవలం యుకెలో కూర్చొని చెప్తున్న మాట కాదని, యుకె, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో నివసిస్తున్న ఎంతో మంది తెలంగాణ బిడ్డల అభిప్రాయం తెలుసుకొని మాట్లాడుతున్నామని తెలిపారు.
ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వారు చేస్తున్న విమర్శలు కేవలం వారి రాజకీయ లబ్ధి కోసమేనని అందులో ఎటువంటి హేతుబద్దత కానీ ప్రజల శ్రేయస్సు లేదని, ప్రజలు వీరిని విశ్వసించే పరిస్థితి లేదని తెలిపారు. కొన్ని పార్టీలు వారి స్థాయి మరిచి, కుల వృత్తులని ప్రోత్సహించడం జీర్ణించుకోలేక, ఎక్కడ ప్రజలు కెసిఆర్ వైపే ఉండి వీరి రాజకీయ భవిష్యత్తు శూన్యం చేస్తారేమోనని భయంతో, అసందర్బంగా కెసిఆర్ గారిని కులాలను ప్రోత్సహిస్తున్నాడని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు ఇవి కేవలం రాజకీయ పబ్బం గడుపోకోవటానికి మాట్లాడుతున్న మాటలే అని కొట్టి పారేశారు. అలాగే కొందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎన్నారైలు పనికట్టుకొని అవగాహన లేకుండా, చదువుకున్నా వాస్తవాలని ఒప్పుకొనే సంస్కారం లేని అజ్ఞానులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. గత పాలకులు తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారని, నేడు వారి కోసం పని చేసే ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తుందని, అటు క్షేత్ర స్థాయిలోని ప్రతిపక్షాలు మరియు విదేశాల్లో ఉన్న వారి పార్టీ ఎన్నారైలు, ఎదో ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా కాకుండా ప్రభుత్వ పథకాలను నిశ్పాక్షికంగా చూసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
కార్యదర్శులు శ్రీ చాడ సృజన రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ చర్చ సంధర్బంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే శ్రీ కిషన్ రెడ్డి గారు తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారు ప్రజలనెత్తి మీది అప్పుల భారం మోపుతున్నారు అన్నదాని మీద సమాధానం చెబుతూ దేశంలోనీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్పులను వివరించారు.
మహారాష్ట్ర 3 లక్షల 56 వేల కోట్లతో దేశంలోని అప్పుల లిస్టులో మొదటి స్థానంలో ఉన్నదని అలాగే ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ 1 లక్షా 65 వేల కోట్లు అప్పు అని కిషన్ రెడ్డి గారు ఆ రాష్ట్రాలను కూడా అప్పులలో కూరుకపోయాయి అని అంటారా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి గారు ఇంత రాజకీయ అనుభవం ఉండి కూడా పూర్తిగా అనుభవ రాహిత్యంగా మాట్లాడడం వారి రాజకీయ అనుభవానికి గౌరవం కాదు అని అన్నారు. అలాగే అప్పులు అన్నవి కొన్ని రాష్ట్రాలకు సంబందించినవి కావు అలాగే ధనిక పేద అని నిర్దారించేవి అంతకన్నా కావు అన్నారు. అమెరికా లాంటి అగ్ర రాజ్యం ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఎక్కువ అప్పుకలిగి ఉన్న దేశం అని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు హుందాగా విలువైన సూచనలు చేస్తూ తెలంగాణ మేలు కోరాలేగాని అసత్యాలను, తప్పుడు ప్రచారాలను చేయవద్దు అని, మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవద్దు అని హితవు పలికారు. ఈ సందర్భంగా బడ్జెట్ మీద చర్చకు ఎన్నారై తెరాస యూకే శాఖ సర్వదా సిద్ధంగా ఉంటదని, బీజేపీ, కాంగ్రెస్ కు సవాలు విసిరారు.
ఈ మీడియా సమావేశం లో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్, అశోక్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, కార్యదర్శి స్రుజన్ హాజరయ్యారు.