కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య చిచ్చు పెట్టేలా జైరాం రమేష్ వ్యాఖ్యలున్నాయని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. హత్యలు చేసిన వాళ్ళే శవాలపై పూలు చల్లినట్లు జైరాం తీరు ఉందని, పార్లమెంటు సాక్షిగా యాదిరెడ్డి తెలంగాణ కోసం బలైతే కనీసం పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు జేఏసీ నాయకులకు టిక్కెట్లు ఇస్తామని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్, జేఏసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ఉద్యమంలో జేఏసీ ఇచ్చిన పిలుపును ఏనాడూ పట్టించుకోని ఇప్పుడిలా టిక్కెట్ల రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్టని, టీఆర్ఎస్, జేఏసీ మధ్య దూరం పెంచడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలపడానికి, ఏపీ భవన్ తెలంగాణకు దక్కకపోవడానికి, ఉద్యోగుల విభజన విషయంలో స్థానికత ఆధారంగా కాకుండా, జనాభా ప్రాతిపదికన జరగడానికీ జైరాం రమేష్ ముఖ్యకారణమని మండిపడ్డారు. ఇకనైనా జైరాం నోరు అదుపులో పెట్టుకోవాలని, తెలంగాణ ప్రజలను, టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే ఊరుకుది లేదని అన్నారు.