mt_logo

తెలంగాణ ప్రజలారా మేల్కోండి… చంద్రబాబకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించండి?

తెలంగాణ ప్రజల 60 ఏళ్ళ పోరాటంతో సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ నాలుగున్నరేళ్ల పసిగుడ్టు తెలంగాణపై ఇంకా కుట్రలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, వలసవాదులు తెలంగాణలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నడు. ఎన్నికల ముసుగులో కొన్ని పార్టీలు వెనక నక్కి, నక్కి వస్తున్నాడన్న విషయం గమనించండి. చంద్రబాబు పార్టీ భాగస్వామ్యంతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే మన నీళ్ళు, నిధులు, ఆత్మగౌరవానికి ముప్పు తప్పదు. హైదరాబాద్ ను అస్థిర పరిచి తెలంగాణను దెబ్బతీయాలని చూస్తున్నడు, ఇంకా మరో ఐదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న విషయం మరిచిపోవద్దు. అందుకే ఈ హైదరాబాద్ లో ఏదో రకంగా వివాదాస్పదం చేయాలని కుట్రలు రచిస్తున్నడు. నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలను కొని మొదటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి పట్టుబడ్డ చంద్రబాబు అమరావతికి పారిపోయిండు మళ్లీ ఎన్నికలు, పొత్తుల, ముసుగులో తెలంగాణ రాజకీయాలను అస్థిరపరిచి తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నడు.

హైదరాబాద్ అస్థిరత పాలయితే తెలంగాణ వెనకబాటుకు గురవుతుందని ప్రజలను హెచ్చరించాలని ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ జర్నలిస్టులు సమావేశంలో నిర్ణయించారు. రాజకీయాలు ఎలా ఉన్న తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ముఖ్యమనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేయాలని తెలంగాణ జర్నలిస్టులుగా మీ ముందుకు వచ్చినం అని దొడ్డిదారిన వస్తున్న చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చంద్రబాబు చేస్తున్నకుట్రలను దీనికి వంతపాడుతున్న వారి గుట్టు బయట పెట్టాలని తెలంగాణ జర్నలిస్టుల సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేసేందుకు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు నర్రా విజయ్, అఫ్జల్, కోవెల సంతోష్, పొన్నం శ్రీనివాస్, బాబూరావు, వాసు, పులిపాటి దామోదర్, సూరజ్ భరద్వాజ్, లివిల్ రెడ్డి, పలువురు పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *