తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ వేడుకలు ఆదివారం Birmingham, United kingdom లో వేంకటేశ్వర దేవాలయంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ (TJUK) ప్రెసిడెంట్ సంపత్ కృష్ణ ధన్నంనేని మరియు తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్(TECA) శశిధర్ ఆధ్యర్యంలో జరిగిన ఈ వేడుకలకు కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా J.K శర్మ, Dr. ప్రకాష్ సహాయ, బాలాజీ టెంపుల్ ట్రస్టీ విచ్చేసి జరిగిన కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంకి ఇంగ్లాండ్ నలుమూలల నుండి ప్రవాస తెలంగాణ వారు సకుటుంబ సపరివారంగా వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు బంగారు బతుకమ్మని చేతబూని వీధులలో కనువిందు చేస్తూ, తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ సంప్రదాయాన్ని కళ్ళకుకట్టినట్లు ఆ బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆటపాటలతో బతుకమ్మని కొలుస్తూ జరుపుకున్నారు.
తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ శాఖ అధ్యక్షుడు సంపత్ కృష్ణ ధన్నమనేని, ఉపాధ్యక్షులు సుష్మ, సుమన్ బలమురి, జనరల్ సెక్రటరీ శ్రవణ్ రెడ్డి, పావని పాల, కోర్ సభ్యులు గణేష్ పాల, ప్రశాంత్, వంశీ మునిగంటి మరియు తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ (TECA) కోర్ కమిటీ మెంబర్స్ శేషేంద్ర, విష్ణు, క్రాంతి, శాశికన్, వెంకట్, శివజ్, ఉపేందర్ తదితరులు కార్యక్రమ విజయానికి తమ వంతు పాత్రను పోషించారు.