ఫొటో: శ్రీకాకుళం కలెక్టరేట్ ముందు తెలంగాణ పుస్తకాన్ని దగ్ధం చేస్తున్న సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు
—
ఆంధ్రప్రదేశ్ చరిత్ర పేరుతో ఇన్నాళ్లూ తాము చెప్పిన అబద్ధాలన్నీ ఒక్కటొక్కటిగా బయటపడుతుండటంతో సీమాంధ్రులకు గంగవెర్రులెత్తిపోతోంది. అందుకే తెలంగాణ నిజ చరిత్రను వెలికి తీసిన పుస్తకాలని తగులబెట్టడం ఇప్పుడు సీమాంధ్ర ఆందోళనకారులకు నిత్యకృత్యంగా మారింది.
తాజాగా వరంగల్ కు చెందిన కపిలవాయి రవీంద్ర రచించిన “చరిత్ర మరచిన రోజు” పుస్తకాన్ని సీమాంధ్రలో అనేకచోట్ల దగ్ధం చేస్తున్నారు.ఆ పుస్తకంలో సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను వివరించిన రవీంద్ర, నవంబర్ 1 ను విద్రోహ దినంగా పేర్కొన్నారు.
సాయుధ పోరాట చరిత్ర నుండి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం వరకూ సీమాంధ్రులు చెప్పిన అనేక అబద్ధాలను, అర్థ సత్యాలను మలిదశ తెలంగాణ ఉద్యమం తుత్తునియలు చేసింది. ఇదే ఇప్పుడు సీమాంధ్ర ఆందోళనకారులకు మింగుడుపడని విషయం అయ్యింది
పుస్తకాలను కాల్చేయగలరేమో కానీ తెలంగాణ ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని రూపుమాపగలరా వీళ్లు?