తెలంగాణ ప్రజలు అరవై దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నవతెలంగాణ ఆవిర్భావ తేదీ జూన్ 2, 2014 గా కేంద్రప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. జూన్ రెండవ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రం 29 వ రాష్ట్రంగా ఏర్పడి సొంత పరిపాలన ప్రారంభిస్తుందని హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దశాబ్దాలుగా బానిసత్వాన్ని అనుభవిస్తూ సీమాంధ్ర పాలకుల దురహంకారానికి, మోసపూరిత చేష్టలకూ బలైన తెలంగాణ ప్రజలు ఇకపై సొంత నిర్ణయాలతో విజయాన్ని సాధిస్తూ ముందుకు పోవడానికి తెలంగాణ రాష్ట్రం మరో మూడు నెలలలోపు ఆవిర్భవించనుంది. వేలాదిమంది అమరవీరుల ఆత్మబలిదానాలకు నిజమైన నివాళి అర్పించే రోజు మరెంతో దూరంలో లేదు. రాష్ట్రపతి సంతకంతో వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ అనుసరించి 3 నెలల తర్వాత తెలంగాణ ఏర్పాటు జరుగుతుంది. అవశేష ఆంధ్రప్రదేశ్ అవతరణ కూడా జూన్ 2 నే అని అధికారులు తెలిపారు. లోక్ సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాక రెండు ప్రాంతాల్లో సొంత రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమవుతుందని భావించి కేంద్రప్రభుత్వం ఆవిర్భావ తేదీని జూన్ రెండుగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఎన్నికలు రెండుప్రాంతాల్లో విడివిడిగా నిర్వహిస్తారా? లేక ఉమ్మడిగా నిర్వహిస్తారా? అన్న విషయం తేలాల్సి ఉంది.
- Silence seems deafening as the blaring mikes go mute
- KTR leaves his mark through innovative campaigning in Telangana elections
- Why minorities should vote for Congress, asks Minister Mahmood Ali
- Leaders from across country arrive in Telangana to take on CM KCR
- CM KCR addresses over 90 public meetings in his whirlwind poll campaign
- ముంపు గ్రామ ప్రజలకు 12 కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తా: సీఎం కేసీఆర్
- ప్రజల హార్షాతిరేకాల నడుమ 96 ప్రజా ఆశీర్వాద సభల ప్రస్థానం
- వరంగల్‌లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జీలు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్
- ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
- గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు: కేటీఆర్
- ప్రభుత్వం ఏర్పాటు చేశాక నెల రోజుల్లో ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం: సీఎం కేసీఆర్
- 111 జీవో పూర్తిస్థాయిలో ఎత్తివేత: సీఎం కేసీఆర్
- ఇందిరమ్మ రాజ్యంలో ‘దళిత బంధు’ లాంటి పథకం పెడితే ఇవ్వాల దళితుల్లో ఇంత దుస్థితి ఉండేది కాదు: సీఎం కేసీఆర్
- బద్మాష్ ప్రచారాలను చేస్తోంది కాంగ్రెస్: సీఎం కేసీఆర్
- కాంగ్రెస్‌ని నమ్మితే రైతు రోడ్డున పడాల్సి వస్తది: సీఎం కేసీఆర్