mt_logo

తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 న

తెలంగాణ ప్రజలు అరవై దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నవతెలంగాణ ఆవిర్భావ తేదీ జూన్ 2, 2014 గా కేంద్రప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. జూన్ రెండవ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రం 29 వ రాష్ట్రంగా ఏర్పడి సొంత పరిపాలన ప్రారంభిస్తుందని హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దశాబ్దాలుగా బానిసత్వాన్ని అనుభవిస్తూ సీమాంధ్ర పాలకుల దురహంకారానికి, మోసపూరిత చేష్టలకూ బలైన తెలంగాణ ప్రజలు ఇకపై సొంత నిర్ణయాలతో విజయాన్ని సాధిస్తూ ముందుకు పోవడానికి తెలంగాణ రాష్ట్రం మరో మూడు నెలలలోపు ఆవిర్భవించనుంది. వేలాదిమంది అమరవీరుల ఆత్మబలిదానాలకు నిజమైన నివాళి అర్పించే రోజు మరెంతో దూరంలో లేదు. రాష్ట్రపతి సంతకంతో వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ అనుసరించి 3 నెలల తర్వాత తెలంగాణ ఏర్పాటు జరుగుతుంది. అవశేష ఆంధ్రప్రదేశ్ అవతరణ కూడా జూన్ 2 నే అని అధికారులు తెలిపారు. లోక్ సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాక రెండు ప్రాంతాల్లో సొంత రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమవుతుందని భావించి కేంద్రప్రభుత్వం ఆవిర్భావ తేదీని జూన్ రెండుగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఎన్నికలు రెండుప్రాంతాల్లో విడివిడిగా నిర్వహిస్తారా? లేక ఉమ్మడిగా నిర్వహిస్తారా? అన్న విషయం తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *