తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ కెనడా సంఘం ఘనంగా నిర్వహించింది. జూన్ 7న ‘తెలంగాణ కెనడా ధూం – ధాం’ పేరిట మిస్సిస్సౌగాలోని గ్లెన్ ఫారెస్ట్ సెకండరీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రవాసులు రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కెనడాలో భారత రాయభారి అఖిలేష్ మిశ్రా హాజరయ్యి తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు పాలు పంచుకోవాలని సూచించారు.
తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి కార్యక్రమాలను ప్రారంభించిన సంఘ సభ్యులు వివిధ నృత్యాలు, నాటక ప్రదర్శనలు, బుర్ర కథలతో హాజరైన 900 మందికి పైగా ఆహుతులను అలరించారు. ఆటా, పాటతో సాగిన సభ చివరగా రుచికరమైన తెలంగాణ వంటల ఆస్వాదనతో ముగిసాయి.
శ్రీ కుందూరి శ్రీనాధ్, శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి, శ్రీ చంద్ర స్వర్గంల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ రమేష్ మునుకుంట్ల సమన్వయ పరిచారు.
for more details and photos click: