డెట్రాయిట్ : రాష్ట్ర ఆవిర్భావ క్షణాన విశ్వవ్యాప్త తెలంగాణ జనకోటి సంబరాల్లో మునిగితేలారు. రాష్ట్ర ఆవిర్భావాన్ని ధూంధాంగా జరుపుకున్నారు. డెట్రాయిట్‌లో తెలంగాణ డెవెలప్‌మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు డెట్రాయిట్ లోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు కేక్ కట్ చేసి పండుగ చేసుకున్నారు. పటాకులు కాల్చి అందరూ సంతోషంగా గడిపారు.

