“సమైక్యాంధ్ర” అంటూ తలతోకా లేని ఆందోళనలు నడిపిస్తున్న సీమాంధ్ర అరాచకశక్తులు కర్నూల్ జిల్లాలో మరో దుశ్చర్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును కర్నూల్ జిల్లా సున్నిపెంట వద్ద అడ్డుకున్న ఆందోళనకారులు “తలంగాణ గో బ్యాక్” అంటూ నినాదాలు చేశారు. జిల్లా పొలిమేరలోకి వస్తే బస్సును ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కండక్టర్ దగ్గరున్న ఎస్సార్ తీసుకుని దాని మీద తెలంగాణకు, కేసీఆర్ కు వ్యతిరేకంగా అసభ్య రాతలు రాశారు.
ఆందోళనకారుల అల్లరిచేష్టలకు విధిలేని పరిస్థితిలో బస్సు డృఐవర్ వెనకకు మరలి వచ్చాడు.
తెలంగాణ ప్రజలపై దాడులు చేసి రాష్ట్ర సమైక్యతను నిలుపుకోవడం అసాధ్యమని ఈ మూర్ఖులకు చెప్పాలె ఎవరైనా…