చిరకాల నిరీక్షణ ఫలించి తెలంగాణ రాష్ట్రం ముంగిట్లోకి అడుగుపెట్టిన వేళ సంబరాలు మిన్నంటాయి. దశాబ్దాల సీమాంధ్ర నిరంకుశ పాలననుండి సంకెళ్ళు తెంచుకుని స్వేచ్ఛగా విహరించేందుకు తెలంగాణ రాష్ట్రం సన్నద్ధమయ్యింది. మంగళవారం లోక్ సభలో తెలంగాణ బిల్లు పాసవ్వడంతో తెలంగాణ పదిజిల్లాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి పటాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. జై తెలంగాణ, జయహో తెలంగాణ అంటూ అరిచిన నినాదాలు మిన్నంటాయి. టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ, టీజేఎఫ్, జాగృతి, సీపీఐ, బీజేపీ, న్యూడెమోక్రసీ, విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, న్యాయవాదులు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకున్నారు. కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని, అమరవీరులకు ఈ విజయం అంకితమని అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్, విద్యార్థులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, తెలంగాణ వాదులు ర్యాలీ నిర్వహించి కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాల వద్ద నివాళులర్పించి పటాసులు పేల్చారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో తెలంగాణ వాదులు నృత్యాలు చేశారు. ఖమ్మం జిల్లాలో సోనియాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. మెదక్ జిల్లాలో తెలంగాణ తల్లికి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అన్నిపార్టీల నేతలు ర్యాలీలు నిర్వహించి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్