mt_logo

తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంది-షిండే

కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం తన నివాసంలో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. సీఎం కిరణ్ ఇచ్చిన నోటీస్ పై తీర్మానాన్ని వాయిస్ ఓట్ తో ఆమోదించిన విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎం ఇచ్చిన తీర్మానం వల్ల బిల్లు ఓడిపోదని, తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఇంకా కేంద్రానికి చేరలేదని, బిల్లు రాగానే పార్లమెంటులో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందేలా చేస్తామని చెప్పారు. శాసనసభలో రాష్ట్రపతి పంపిన బిల్లుపై సభ్యుల చర్చ ముగిసినా సీఎం ఇచ్చిన తీర్మానాన్నే పెద్దపెద్ద బ్యానర్లతో చూపించిన సీమాంధ్ర మీడియాకు షిండే ఇచ్చిన వివరణ గొడ్డలిపెట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *