హైదరాబాద్ లో గురువారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం భవనం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో కేంద్ర మాజీమంత్రి విద్యాసాగర్ రావు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లిపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే, దాన్ని చింపేస్తానంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. అక్కడ బిల్లు చింపితే ఇక్కడ ప్రజలు నిన్ను చించుతారంటూ హెచ్చరించారు.
సీడబ్ల్యూసీ తీర్మానం శిలాశాసనం అని అన్న వారు … ఆ శాసనంపై కేంద్రపాలిత ప్రాంతం, ఉమ్మడి రాజధాని, హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రానికే అంటూ శిల్పాలు చెక్కుతున్నారని ఆయన చమత్కరించారు.
హైదరాబాద్ లో అభద్రత అంటూ సీమాంధ్రులు అనడాన్ని ఆయన అపహాస్యం చేస్తూ ఫాక్షనిజం చేసే మీకు అభద్రతా?… అలాంటిదేదైనా వుంటే అది తెలంగాణ వారికి మీ వలన వుంటుందని అన్నారు.