mt_logo

తెదేపా సమైక్యాంధ్రకు జై కొడుతుందా?

తెలంగాణపై టీడీపీ తీరు రోజుకో విధంగా మారుతుంది. మొదటి నుంచీ రెండు నాల్కల ధోరణే అవలంబిస్తూ వస్తుంది. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే చంద్రబాబు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారు. తెలంగాణ పేరెత్తిన నాయకులను వారంతట వారే పార్టీలోనుండి బయటకు వెళ్ళేలా చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్ష అనంతరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడ్తున్నామని ప్రకటించగానే అర్ధరాత్రి తెలుగు జాతిని విడదీస్తారా? అని ధ్వజమెత్తారు. దాంతో తెలంగాణాలో జరిగిన అన్ని ఎలక్షన్లలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తమ రాజకీయ జీవితం ప్రశ్నార్ధకంగా మారిన తెలంగాణ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేట్లు చేశారు. అయినా లాభం లేకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. దీంతో చంద్రబాబు టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు. తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించారు.

జూలై 30వ తేదీన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని సీడబ్ల్యూసీ ప్రకటించింది. అదేరోజు సీమాంధ్ర అభివృద్ధి కోసం 5లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇవ్వాలని అన్నారు. తర్వాతి రోజు తెలంగాణపై నిర్ణయం మార్చుకొని సమన్యాయం అంటూ డ్రామాలాడారు. ఢిల్లీలో నిరశన దీక్ష చేసి నవ్వుల పాలయ్యారు. గురువారం కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లును ఆమోదించిన సందర్భంగా టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఉత్కంఠ. బిల్లును ఆమోదించడంలో సహకరించకపోతే తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పలువురి వాదన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *