ఫొటో: దొంగదీక్ష చేసిన బోడే ప్రసాదును అదుపులోకి తీసుకున్న ఉయ్యూరు పోలీసులు
—
సమైక్యాంధ్ర ఉద్యమంలో సమైక్యత నేతిబీరకాయలో నెయ్యంత అని మరోసారి నిరూపణ అయ్యింది.
కృష్ణా జిల్లా ఉయ్యూరులో మూడు రొజుల క్రితం తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కొరకు బోడే ప్రసాద్ అనే తెలుగుదేశం నాయకుడు దీక్ష మొదలుపెట్టాడు. పగలు దీక్ష శిబిరంలో ఉండే ఆయన రాత్రి అవగానే పక్క ఉన్న ఓ హోటల్ రూముకు రహస్యంగా చేరుకుని అల్పాహారం ఆరగించడం మొదలుపెట్టాడు.
ఈ నాటకం తెలవని స్థానిక పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి బోడే ప్రసాద్ దీక్షను భగ్నం చేయడానికి శిబిరంలోకి వచ్చారు.
అక్కడ బోడే ప్రసాద్ బదులు అచ్చు అలాంటి వేషధారణలో ఇంకొక వ్యక్తి ఉండటం చూసి వారు అవాక్కయ్యారు.
ఆ వ్యక్తిని పోలీసు శైలిలో విచారించగా నిజం కక్కేశాడు. రోజూ రాత్రి ప్రసాద్ దీక్షా శిబిరంలో కాక హోటల్ రూములో ఉంటాడని సదరు వ్యక్తి వివరించాడు. దీనితో మరింత్ షాక్ కు లోనైన పోలీసులు పక్కన ఉన్న హోటల్లో 101 రూములో విశ్రాంతి తీసుకుంటున్న బోడే ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు.
సో! ఇవండీ మన సమైక్యవాదుల దొంగ దీక్షల కథలు.