mt_logo

విశాఖలో తెదేపా-కాంగ్రెస్ సమైక్య బాహాబాహీ

పైకి వారు చేసేది సమైక్య ఉద్యమం. చెప్పేది అందరం కలిసి ఉండాలని. కానీ పైన ముసుగు తీసేస్తే అంతా రాజకీయ స్వార్ధం

విశాఖలో సమైక్యాంధ్ర దీక్షలు చేస్తున్న తెలుగుదేశం – కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మధ్య నిన్న పెద్ద కొట్లాటే జరిగింది.

జులై 30 సీడబ్లూసీ ప్రకటన వచ్చిన తరువాత ఒక వారం రోజులకు తెదేపా-కాంగ్రెస్ పార్టీలు గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్యాలయం ముందు దీక్షా శిబిరాలు మొదలుపెట్టిండ్రు.

అయితే సమైక్యత మాట వదిలేసిన ఇరుపార్టీలు రోజూ ఒకరి నాయకత్వాన్ని ఒకరు మాటల్లో, రకరకాల ఫ్లెక్సీ బ్యానర్ల ద్వారా విమర్శించసాగారు. దీంతో అనేకసారు ఇరు శిబిరాల మధ్య కొట్లాటలు జరిగాయి. బుధవారం నాడు తెదేపా వారు మాజీ ఎంపీ సుబ్బరామి రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నిస్తే, కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు ఇద్దరినీ శాంతిపజేసి పంపించివేశారు. కానీ శుక్రవారం ఇరువర్గాలు మళ్లీ ఒకరి ఫ్లెక్సీలను ఒకరు కాలబెట్టడంతో మరోసారి గొడవ ముదిరింది. దారినపోయే ప్రజలు ఆశ్చర్యంతో చూస్తుండగానే ఇరువర్గాలు మరోసారి కొట్టుకున్నారు.

పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలు ఝుళిపించి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది.

ఈ వరుస ఘర్షణలతో శాంతిభద్రతలు కాపాడేందుకు గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్యాలయం ముందున్న సమైక్యాంధ్ర దీక్ష శిబిరాలను పోలీసులు ఎత్తేయించారు.

పైకి ఎన్ని కథలు చెప్పినా సీమాంధ్రలో జరుగుతున్నది రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరేనని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *