తెలంగాణ మీద ప్రతిరోజూ ఆంధ్రజ్యోతిలో విషం చిమ్మడమే రాధాకృష్ణ దినచర్య. ఆ క్రమంలో ఎన్ని పచ్చి అబధ్ధాలనైన అలవోకగా ఆడేయడం రాధాకృష్ణ బ్యాచి నైజం.
తెలంగాణ అంశంపై ఆంధ్రజ్యోతి ఆడిన అబద్ధాలను పక్కా సాక్ష్యాధారాలతో సహా ఇది వరకు ఎన్నోసార్లు మేం ఎత్తిచూపడం జరిగింది.
తెలంగాణ బిల్లు తుది అంకానికి చేరుకున్నా కుక్క తోక వంకర రాధాకృష్ణ బ్యాచ్ మాత్రం తన అబద్ధాల జాతరను ఆపలేదు.
మొన్నటి పత్రికలో “తప్పుల తడకలా టి-బిల్లు” అనే శీర్షికతో తెలంగాణ ముసాయిదా బిల్లులో అయిదు నియోజకవర్గాల పేర్లు లేవని, 119కి గాను 114 మాత్రమే ఉన్నాయని ఆంధ్రజ్యోతి కూసింది.
తెలంగాణ బిల్లును చాలా నిర్ల్యక్షంగా తయారుచేశారని అందుకే అది తప్పుల తడకలా మారిందని తప్పుడు కూతలు కూసింది. అసలు ఇంత నిర్ల్యక్షంగా బిల్లెలా తయారైందని అందరూ ఆశ్చర్యపోతున్నారని స్వంత “కపిత్వం” అల్లింది. అసలీ తప్పును సరిదిద్దుకోవాలంటే మళ్లీ బిల్లును కేంద్రానికి పంపాల్సి వస్తుందేమోనని పైశాచిక ఆనందాన్ని పొందింది ఆంధ్రజ్యోతి.
తీరా నిన్న బిల్లు ప్రతి వచ్చిన తరువాత చూస్తే అందులో నియోజకవర్గాల లిస్టు సరిగ్గానే ఉన్నది. దీనితో ఆంధ్రజ్యోతి రాసింది పచ్చి అబద్ధం అని మరోసారి బట్టబయలైంది.
కింద ఆ లిస్టును చూడొచ్చు మీరు:
మరి ఇంత నిస్సిగ్గుగా అబద్ధాన్ని అచ్చోసి వదిలిన ఈ వదరుబోతు పత్రికను తెలంగాణ పొలిమేరల దాకా తరమాలె కదా మనం? తెలంగాణ మీద అవకాశం వచ్చిన ప్రతిసారి అబద్ధాలను, అర్థసత్యాలను అచ్చేసి విషాన్ని చిమ్మే ఈ సీమాంధ్ర జ్యోతిని ఇంకా తెలంగాణ ప్రజలు చదవడం అంటే అది మన ఉద్యమానికే అవమానం.