అభిప్రాయాలు రాసిస్తామని స్పీకర్ కు తెలంగాణ ఎమ్మెల్యేల లేఖ!
రాష్ట్ర విభజనపై చర్చ జరక్కుండా అడుగడుగునా అడ్డుపడుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేల కుట్రలను తిప్పికొట్టడానికి టీ ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా స్పీకర్ కు ఒక లేఖను సమర్పించారు. బుధవారం విభజన బిల్లుపై చర్చ జరగాల్సి ఉండగా సీమాంధ్ర సభ్యులు చర్చ జరక్కుండా అడ్డుపడడంతో స్పీకర్ గురువారం నాటికి సభను వాయిదా వేశారు. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటే సభను నిరవధికంగా వాయిదా వేసి తమ ఆభిప్రాయాలను రాష్ట్రపతికి రాతపూర్వకంగా పంపించాలని పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు లేఖ రూపంలో స్పీకర్ కు అందచేసారు. ఆ లేఖ మీద అన్ని పార్టీలకు చెందిన టీ ఎమ్మెల్యేలు సంతకం చేశారు. స్పీకర్ దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.