mt_logo

జనవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే టీ బిల్లు: షిండే!!

తెలంగాణ బిల్లును జనవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశబెట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మత హింస నిరోధక బిల్లును కూడా జనవరిలో జరిగే సమావేశాల్లోనే ప్రవేశబెడతామన్నారు. నిజానికి ప్రస్తుత సమావేశాల్లోనే ఈ రెండు బిల్లులూ పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉండగా సభలో జరిగిన గందరగోళం వల్ల ప్రవేశపెట్టలేదని, అసెంబ్లీలో ఇంకా పునర్విభజన బిల్లుపై చర్చ జరగనందున బిల్లు పార్లమెంటుకు రాలేదని, జనవరిలో తప్పకుండా రెండు బిల్లులూ చర్చకు వస్తాయని సుశీల్ కుమార్ షిండే తెలిపారు. సమావేశాలు త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *