–
గడచిన ఆరు దశాబ్దాలుగా సీమాంధ్ర వలసపాలకులు తెలంగాణ ప్రాంతంపై చూపిన వివక్ష అంతా ఇంతా కాదు. దానికొక మచ్చుతునక శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలై నాలుగు దశాబ్దాలు దాటినా ఇంకా నల్లగొండ జిల్లాలో దాని ఆయకట్టు ప్రాంతాలకు నీరు రావడం లేదు.ఈనాటికీ ఆ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వలు జిల్లా ప్రజలను బోసిగా వెక్కిరిస్తున్నాయి.
ఈ వివక్షకు నిరసనగా తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ శాఖ ఒక వినూత్న తరహాలో నిరసన చేపట్టింది గతవారం. అర్వపల్లి మండలం దేవరకొత్తపల్లి గ్రామం సమీపంలో 71 డి.భి.ఎం ఖాళీ కాల్వలోనే ఒక సదస్సు నిర్వహించి సీమాంధ్ర పాలకుల వైఖరిని ఎండగట్టారు తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులు.
ఈ సమావేశంలో నీటిపారుదల నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే, శ్యాంసుందర్ రెడ్డి పాల్గొని తెలంగాణకు నీటిపారుదలలో జరుగుతున్న అన్యాయాన్ని సోదాహరణంగా వివరించారు.