హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు సీమాంధ్ర ప్రభుత్వం చేస్తోన్న మరో కుట్ర బయట పడింది. గతవారం రాష్ట్ర ప్రభుత్వం శివారు గ్రామాలను బలవంతంగా గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేస్తూ హుటాహుటిన ఉత్తర్వులు జారీచేసింది. కొంతమంది సీమాంధ్ర రాజకీయ నాయకులు, అధికారుల స్వార్ధ ప్రయోజనాలకు అనుకూలంగా ఈ విలీనం జరిగినట్లు తెలుస్తోంది.
రాజేంద్రనగర్ మండలానికి కు చెందిన 14 గ్రామపంచాయతీలను హైదరాబాద్ నగరంలో కుట్రపూరితంగా విలీనం చేశారు.
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత విలీన ప్రక్రియ మొదలుపెట్టాల్సిందిగా గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఐనా అధికారులు ఆ ఆదేశాలను తుంగలోతొక్కి గత నెల ఆగష్టు 31న మండలంలోని కొన్ని గ్రామాలను జీహెచ్ ఎంసీలో విలీనం చేశారు. ఆ తర్వాత రెండో ప్రకటన చేసి మరో 3 గ్రామాలను కూడా విలీనం చేశారు.
ఈ విలీన ప్రక్రియ వెనుక ఖచ్చితంగా సీమాంధ్ర రియల్టర్లు , పెద్దల హస్తం వుంది కనుక దీనిపై సమగ్ర విచారణ జరిపి, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మాత్రమే విలీన నిర్ణయం తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న ఈ సమయంలో జరిగిన ఈ విలీనం కుట్రపూరితమేనని తెలంగాణ నాయకులు అంటున్నారు.