తెలుగు భాష పేరిట తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న సీమాంద్ర్హులకు ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలంగాణ బిడ్డలు తమ నిరసన తెలిపారు. తెలుగు సభలు జరుగుతున్న ప్రాంగణం వద్ద ఈ సభలు ఆధిపత్య సభలని, అహంకార సభలని నినాదాలతో హోరెత్తించారు. సభకు వచ్చిన డెలిగేట్స్ ముందు తెలంగాణ వాణి వినిపించారు.
తమకున్న డబ్బు, మంద బలంతో తెలంగాణవాదులపై బెదిరింపులకు దిగినప్పటికీ వెరవని తెలంగాణ బిడ్డలు ప్రవాసంలోనూ తమ ఉద్యమస్ఫూర్తి చాటారు.
సిడ్నీలో తలపెట్టిన ఈ తెలుగు సభలను తెలంగాణ ప్రాంత ప్రముఖులు, పౌరులు బహిష్కరించాలని వినోద్ ఎలేటి నేతృత్వంలో ఆస్ట్రేలియా తెలంగాణా ఫోరం రెండు నెలలుగా నిరంతరం ప్రచారం చేసింది. వీరి ప్రచారం వల్ల తెలుగు మహాసభ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ తన పదవికి రాజీనామా కూడా చేశారు.