mt_logo

పార్లమెంటులో సీమాంధ్ర తీవ్రవాదుల దాడి!!

ఈ రోజు పార్లమెంటు చరిత్రలోనే చీకటి రోజు. సీమాంధ్ర ఎంపీలు ఉగ్రవాదుల్లా లోక్ సభలో కత్తులు, కటార్లతో ఆకురౌడీలుగా ప్రవర్తించిన తీరు ప్రపంచప్రజానీకం విస్తుపోయేలా చేసింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్లమెంటుపై తీవ్రవాదుల్లా సీమాంధ్ర ఎంపీలు రెచ్చిపోయి దాడి చేయడాన్ని అన్ని జాతీయ పార్టీల నేతలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈరోజు ఉదయం లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగానే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నను అడుగుతున్న సమయంలో సీమాంధ్ర ఎంపీలు పోడియాన్ని చుట్టుముట్టడంతో స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగానే తెలంగాణ ఏర్పాటు బిల్లును హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టారని స్పీకర్ ప్రకటించగానే సీమాంధ్ర ఎంపీలు వీరంగం సృష్టించారు. సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పీకర్ పై పెప్పర్ స్ప్రే చల్లడంతో స్పీకర్ తో పాటు మరికొందరు సభ్యులు, ఎంపీలు తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. మిగతా ఎంపీలు అందరూ భయంతో లోక్ సభ బయటికి పరుగులు తీశారు. మరో సీమాంధ్ర టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మైకులు విరగ్గొట్టి కడుపులో పొడుచుకుంటున్నట్లు నటించడం, మిగతా సీమాంధ్ర ఎంపీలు టేబుల్ ఎక్కి మైకులు విసిరేయడం ద్వారా పార్లమెంటు పరువును భ్రష్టుపట్టించారు. తెలంగాణ బిల్లు ప్రతులను హోం మంత్రి షిండే నుండి లాక్కునేందుకు సీమాంధ్ర ఎంపీలు దాడి చేసినంత పనిచేశారు. వారి బారినుండి స్పీకర్ కు, షిండేకు తెలంగాణ ఎంపీలు అడుగడుగునా రక్షణగా నిలిచారు. లగడపాటి చల్లిన విషరసాయనాల స్ప్రే దుర్వాసన వల్ల ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డ పలువురు అస్వస్థతకు గురవ్వడంతో వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించారు. లగడపాటి చేసిన దారుణమైన చర్యను ప్రపంచమంతా అసహ్యించుకుంటుందని, ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని, దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ వ్యాఖ్యానించారు. సైకో లగడపాటిపై జీవితకాల వేటు వేయాలని, ఇలాంటివారు ఎన్నికలకు దూరంగా ఉండేలా చట్టాలు తీసుకురావాలని పలువురు ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేస్తున్నారు. సభలో దౌర్జన్యం చేసిన సీమాంధ్ర ఎంపీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరతామని కమల్ నాథ్ చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు కత్తులు, పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్ తో లోపలికి వచ్చినట్లుగా భద్రతాసిబ్బంది స్పష్టం చేశారు. అన్ని పార్టీల నేతలూ ఈ దారుణమైన చర్య పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. స్పీకర్ మీరాకుమార్ సీమాంధ్ర ఎంపీలతోపాటు ప్రతిఘటించిన తెలంగాణ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. పెప్పర్ స్ప్రే వల్ల టీడీపీ సీమాంధ్ర ఎంపీ కొనకళ్ళ నారాయణ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. లోక్ సభలో దాడిచేసిన లగడపాటిని పార్లమెంటు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని డిల్లీ పోలీసులకు అప్పగించనున్నారు. పార్లమెంటు సభ్యులను హత్య చేసేందుకు ప్రయత్నించిన లగడపాటిపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సభ జరిగే అవకాశాలు లేకపోవడంతో లోక్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *